భారతదేశం, జనవరి 30 -- లేటెస్ట్ ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్ ధురంధర్. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో అదరగొట్టింది. కొత్త రికార్డులు నెలకొల్పింది. ఆదిథ్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేశారు. ఎట్టకేలకు ఈ రోజు (జనవరి 30) ధురంధర్ ఓటీటీలోకి వచ్చింది. కానీ ఫ్యాన్స్ మాత్రం నిరాశకు గురవుతున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ఫైర్ అవుతున్నారు.

డిసెంబర్ 25, 2025న థియేటర్లలో రిలీజైన ధురంధర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అత్యంత వేగంగా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిన మూవీగా నిలిచింది. హిందీలో అత్యధిక కలెక్షన్లు సొంతం చేసుకున్న సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ స్పై థ్రిల్లర్ శుక్రవారం ఓటీటీలో రిలీజైంది. కానీ దీన్ని స్ట్రీమింగ్ చేస్తున్న పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌పై మ...