Hyderabad, ఏప్రిల్ 28 -- మలయాళం ఇండస్ట్రీలో ఏడాదికి సగటున నాలుగైదు సినిమాలు చేస్తూ మినిమం గ్యారెంటీ హిట్స్ అందించే నటుడు బేసిల్ జోసెఫ్. కామెడీతోపాటు ఎమోషనల్ సీన్లలోనూ అద్భుతంగా నటించే అతడు.. ఈ ఏడాది ఇప్పటికే మూడు మూవీస్ చేశాడు. అందులో పొన్‌మ్యాన్, ప్రవీంకూడు షాప్పు ఇప్పటికే ఓటీటీలోకి రాగా.. ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. ఆ మూవీ పేరు మరణమాస్.

మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో డార్క్ కామెడీ హిట్ మూవీ మరణమాస్ (Maranamass). ఈ ఏడాది బేసిల్ జోసెఫ్ నటించిన మూడో సినిమా ఇది. ప్రముఖ మలయాళ నటుడు టొవినో థామస్ నిర్మాతగా ఈ మూవీని నిర్మించాడు. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.20 కోట్ల వసూళ్లతో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

విషు పండగ సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. వచ్చే నెలలో సోనీ లివ్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. శివప్రసాద్ డైరెక్ట్ చేసిన...