భారతదేశం, డిసెంబర్ 4 -- బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ చిత్రం 'థామా'. మాడాక్ ఫిలిం ఫ్రాంచైజీ నుంచి వచ్చిన థామా ఓటీటీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

డిసెంబర్ 02 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో థామా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం రెంట్ పద్ధతిలో థామా స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో అందరూ ప్రేక్షకులు థామాను ఓటీటీలో చూసేందుకు వీలు లేకుండా పోయింది.

ఈ క్రమంలోనే థామా ఫ్రీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉచితంగా థామాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. అంతేకాకుండా థామా ఫ్రీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించిందట అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ.

డిసెంబర్ 16 నుం...