భారతదేశం, జనవరి 11 -- నాలుగేళ్ల విరామం తర్వాత బాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్ హీరోగా నటించిన హిస్టారికల్ వార్ డ్రామా '120 బహదూర్' (120 Bahadur). థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.

భారీ అంచనాల మధ్య ఈ 120 బహదూర్ గతేడాది నవంబర్ 21న థియేటర్లలో రిలీజైంది. సుమారు రెండు నెలల తర్వాత అంటే జనవరి 16 (శుక్రవారం) నుంచి ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్లకు ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అయితే అంతకంటే ముందే ఈ చిత్రాన్ని చూడాలనుకునే సినీ ప్రియుల కోసం అమెజాన్ ఒక వెసులుబాటు కల్పించింది.

ప్రస్తుతం ప్రైమ్ వీడియో 'స్టోర్' విభాగంలో రూ. 349 చెల్లించి ఈ సినిమాను రెంట్ విధానంలో తీసుకొని చూడవచ్చు...