భారతదేశం, జనవరి 8 -- ఇప్పటివరకు సముద్రపు దొంగ జాక్ స్పారోగా హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో తెలిసిందే. కరెబియన్ ఆఫ్ పైరెట్స్ సిరీస్‌తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జానీ డెప్‌ను ఇక మర్చిపోయేలా చేసేందుకు వస్తోంది బ్యూటిఫుల్ అండ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.

అత్యంత క్రూరమైన, రక్తపాతంతో కూడిన సముద్రపు దొంగగా ప్రియాంక చోప్రా కనిపించనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ది బ్లఫ్' (The Bluff) చిత్రం నుంచి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ను బుధవారం (జనవరి 7) రిలీజ్ చేశారు మేకర్స్.

ది బ్లఫ్ సినిమాలో ప్రియాంక చోప్రా 'బ్లడీ మేరీ'గా కనిపిస్తున్న తీరు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ పోస్టర్లను పంచుకుంటూ.. "తల్లి.. రక్షకురాలు.. సముద్రపు దొం...