Hyderabad, జూన్ 3 -- ప్రియమణి నటించిన మరో వెబ్ సిరీస్ ఓటీటీలోకి వస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఇప్పుడామె ఓ తమిళ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తాజాగా జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుందంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది.

ప్రియమణి నటిస్తున్న వెబ్ సిరీస్ గుడ్ వైఫ్ (Good Wife). ఇదే పేరుతో వచ్చిన అమెరికన్ షో ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. హాట్‌స్టార్ స్పెషల్స్ గుడ్ వైఫ్ త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియోహాట్‌స్టార్ మంగళవారం (జూన్ 4) వెల్లడించింది. "ఒక్క రాత్రి అంతా మార్చేసింది. ఇప్పుడిక కుటుంబం కోసం ఆమె పోరాటం మొదలైంది.

గుడ్ వైఫ్ త్వరలోనే జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది" అని ఆ ఓటీటీలో వెల్లడించింది. దీంతోపాటు ఓ పోస్టర్ కూడా రిలీజ...