భారతదేశం, ఏప్రిల్ 21 -- సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'యూ' చాలా పాపులర్ అయింది. పెన్‍ బాడ్‍గ్లే ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్‍లో ఇప్పటి వరకు వచ్చిన నాలుగు సీజన్లు మంచి సక్సెస్ సాధించాయి. నాలుగో సీజన్ తర్వాత చివరిదైన 5వ సీజన్ కోసం చాలా మంది ఎదురుచూశారు. ఎట్టకేలకు యూ వెబ్ సిరీస్‍లో ఐదో సీజన్ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఈ వారంలోనే స్ట్రీమింగ్‍కు రానుంది.

యూ సీజన్ 5 నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ గురువారం ఏప్రిల్ 24వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో చివరి సీజన్ 10 ఎపిసోడ్లు అదే రోజు అందుబాటులోకి వస్తాయి.

కరోలిన్ కెప్నెస్ రచించిన యూ అనే నవల ఆధారంగా అదే పేరుతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. 2018లో తొలి సీజన్ వచ్చింది. 2019ల రెండో సీజన్, 2021లో మూడోది, 2023లో మూడో సీజన్ అడుగుపెట్టాయి. తాను ఇష్టపడే మహిళలను, తనకు అడ్డం వచ్చే వారిని...