Hyderabad, జూలై 26 -- పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా హరిహర వీరమల్లు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కల్యాణ్ నుంచి వచ్చిన తొలి సినిమా ఇది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి తగినట్లుగానే సినిమాను తెరకెక్కించినట్లు మేకర్స్ చెప్పారు.

హరి హర వీరమల్లు సినిమాకు క్రిష్ జాగర్లమూడి, ఏఎమ్ జ్యోతి కృష్ణ ఇద్దరు దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం సమర్పణలో మూవీని నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా పవన్ కల్యాణ్‌కు జోడీ కట్టగా.. యానిమల్ యాక్టర్ బాబీ డియోల్ విలన్‌గా చేశాడు.

జూలై 24న థియేటర్లలో విడుదలైన హరి హర వీరమల్లు సినిమాకు అంతకుముందు రోజు రాత్రి పడిన ప్రీమియర్ షోల నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. ఫస్టాఫ్ చాలా బాగుందని, కానీ, ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్‌లో సినిమాను అటకెక్కించారని మ...