భారతదేశం, నవంబర్ 22 -- తెలుగులో రీసెంట్‌గా వచ్చిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ కామెడీ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చేసిన మెమోరీ కార్డ్ పోతే ఆ ఫొటోగ్రాఫర్ ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడో కామెడీగా చిత్రీకరించిన సినిమా ఇది. ఈ సినిమాలో తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటించారు.

నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 8.5 రేటింగ్ కూడా సంపాదించుకుంది. అలాంటి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీలోకి వచ్చేయనుంది.

తాజాగా నిన్న (నవంబర్ 21) ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5లో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఓటీటీ రిలీజ్ కాన...