Hyderabad, ఏప్రిల్ 25 -- ఓటీటీలో వచ్చే హారర్ థ్రిల్లర్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు సరికొత్త కథా కథనాలతో హారర్ థ్రిల్లర్స్ వస్తాయా అని ఓటీటీ ఆడియెన్స్ ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ వారంలో చాలా స్పెషల్‌గా ఓ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ నేరుగా ఇవాళ (ఏప్రిల్ 25) ఓటీటీలోకి వచ్చేసింది.

నేడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన హారర్ సస్పెన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయ్యన మనే. కన్నడ భాషలో హారర్, సస్సెన్స్, మిస్టరీ, క్రైమ్ అంశాలతో అయ్యన మనే తెరకెక్కింది. ఈ సిరీస్‌లో మెయిన్ లీడ్ రోల్‌లో తెలుగు హీరోయిన్ ఖుషి రవి నటించింది. పిండం, ఊరు పేరు భైరవ కోన, దియా వంటి సినిమాల్లో నటించిన ఖుషి రవి అయ్యన మనేలో ప్రధాన పాత్ర పోషించింది.

శ్రుతి నాయుడు క్రియేటర్‌గా వ్యవహరించిన అయ్యన మనే సిరీస్‌కు రమేష్ ఇందిరా దర్శకత్వం వహించారు. ఖుషి రవి...