భారతదేశం, నవంబర్ 25 -- ఓటీటీలోకి ఈమధ్యే వచ్చిన తెలుగు కామెడీ మూవీ ఏనుగుతొండం ఘటికాచలం. ఈ సినిమా నేరుగా డిజిటల్ ప్రీమియర్ అయింది. రవిబాబు డైరెక్ట్ చేసి, అతిథి పాత్రలో నటించిన ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా ఓ అరుదైన స్ట్రీమింగ్ రికార్డును సొంతం చేసుకుంది.

లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ ఏనుగుతొండం ఘటికాచలం ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తాజాగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

"కడుపుబ్బా నవ్వించే బ్లాక్‌బస్టర్ 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్‌తో.. ఏనుగు తొండం ఘటికాచలం ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. విన్ ఒరిజినల్ ఫిల్మ్. కేవలం ఈటీవీ విన్ లో చూడండి" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఓ స్పెషల...