Hyderabad, అక్టోబర్ 3 -- ఓటీటీలోకి ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ఈ ఓటీటీ సినిమాలు డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి. అలాగే, అప్పటివరకు హీరోలుగా అలరించిన నటులు ఒక్కసారిగా విలన్ అవతారం ఎత్తుతుంటారు.

అలా, తాజాగా మరో హీరో విలన్‌గా అలరించేందుకు రెడీ అయ్యాడు. అతనే జితేంద్ర కుమార్. అమెజాన్ ప్రైమ్‌లోని పంచాయత్ వెబ్ సిరీస్‌కు ఎంత పెద్ద క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు సీజన్స్‌తో పంచాయత్ సిరీస్ అదరగొడుతోంది. ఈ సిరీస్‌లో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు జితేంద్ర కుమార్.

అలాంటి జితేంద్ర కుమార్ విలన్‌గా చేసిన ఓటీటీ సిరీస్ భాగవత్ చాప్టర్ 1 రాక్షస్. ఇందులో సమాజంలోని రాక్షసుడిగా జితేంద్ర కుమార్ చేయనున్నాడు. రాక్షసుడు అయిన జితేంద్ర కుమార్‌ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్‌గా బాలీ...