Hyderabad, జూన్ 16 -- మహానటి కీర్తి సురేశ్ సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. టాలీవుడ్‌లో యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్‌ హీరోగా సుహాస్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాంటి కీర్తి సురేశ్, సుహాస్ కలిసి నటించిన సినిమా ఒకటి ఉంది. అయితే, అది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ఆ మూవీనే ఉప్పు కప్పురంబు. కీర్తి సురేశ్, సుహాస్ తొలిసారిగా కలిసి నటించిన ఉప్పు కప్పురంబు సినిమాను ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించారు. ఈ మూవీకి ఐవి శశి దర్శకత్వం వహించారు. ఉప్పు కప్పురంబు సినిమాలో కీర్తి సురేశ్, సుహాస్‌తోపాటు బాబు మోహన్, శత్రు, తళ్లూరి రామేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించారు.

వసంత్ మారింగంటి రచించిన ఉప్పు కప్పురంబు సినిమా 1990ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో సెటైరికల్ కామెడీ చిత్రంగా తెరకెక్కింది. ద...