భారతదేశం, నవంబర్ 21 -- ఈ నెల మొదట్లో థియేటర్లలో రిలీజైన తెలుగు కామెడీ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. తిరువీర్, టీనా శ్రావ్య, రోహన్ రాయ్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు థియేటర్లలో పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇప్పుడీ మూవీ నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. డిసెంబర్ లో మొదటి వారంలోనే స్ట్రీమింగ్ కానుంది.

వెరైటీ స్టోరీతో నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగు కామెడీ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ సినిమా డిసెంబర్ 5న డిజిటల్ ప్రీమియర్ కానుంది. జీ5 ఓటీటీలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.

"థియేటర్లలో విజయవంతమైన రన్ తర్వాత ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఎన్నో నవ్వులను మోసుకుంటూ జీ5లోకి వస్తోంది. ఈ ఫన్ ట్రైలర్ తో సిద్ధంగా ఉండండి" అనే క్యాప్షన్ తో జీ5 ఓటీటీ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. చిన్న సినిమానే అయినా.. ఈమూవీ ఓటీటీ ...