భారతదేశం, జూలై 17 -- వరల్డ్ వైడ్ గా ఎంతో ఫేమస్ అయిన.. ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాపులర్ వెబ్ సిరీస్ లో చివరిదైన అయిదో సీజన్ వచ్చేస్తోంది. ఈ నెట్‌ఫ్లిక్స్ మోస్ట్ వాచ్ డ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ లాస్ట్ సీజన్ స్ట్రీమింగ్ డేట్లను ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. ఈ హారర్, మిస్టరీ థ్రిల్లర్ టీజర్ ను కూడా రిలీజ్ చేసింది. రెండు భాగాలుగా ఈ సీజన్ ను డిజిటల్ స్ట్రీమ్ చేయనుంది.

నెట్‌ఫ్లిక్స్ పాపులర్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' చివరి సీజన్ స్ట్రీమింగ్ డేట్ ను ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. ఈ హారర్, మిస్టరీ థ్రిల్లర్ రెండు పార్ట్ లు గా స్ట్రీమింగ్ కానుంది. 2025 నవంబర్ 26న నాలుగు ఎపిసోడ్లు ఒకేసారి ఓటీటీలోకి వస్తాయి. డిసెంబర్ 25న మరో మూడు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కు వస్తాయి. కొత్త ఏడాది సందర్భంగా డిసెంబర్ 31న ఫైనల్ ఎపిసోడ్ ప్రసారమవ...