Hyderabad, ఆగస్టు 4 -- ఓటీటీలో ఇటీవల కాలంలో ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తండ్రి గొప్పదనం గురించి చెప్పే కథలు ఎన్నో ప్రతివారం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా నిన్న (ఆగస్ట్ 3) కూడా మరో తండ్రీకూతుళ్ల కథతో తెలుగులో ఓ సినిమా ఓటీటీ రిలీజ్ అయింది.

ఆ సినిమానే థాంక్ యూ నాన్న. తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రంగా థాంక్ యూ నాన్న తెరకెక్కింది. బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై థాంక్ యూ నాన్న సినిమాను ప్రముఖ నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సురేంద్ర ఉన్నారు.

థాంక్ యూ నాన్న సినిమాకు జై కథ, దర్శకత్వం వహించారు. మనసుకు హత్తుకునే డైలాగ్స్ ఉన్న థాంక్ యూ నాన్న సినిమాకు తిమ్మర్ రెడ్డి వంకా డైలాగ్స్, స్క్రీన్ ప్లే అదించారు. ఇక...