Hyderabad, ఆగస్టు 1 -- రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం కింగ్డమ్. మళ్లీ రావా, జెర్సీ వంటి ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ్ దేవరకొండతోపాటు మరో హీరో సత్యదేవ్ కింగ్డమ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు.

వీరితోపాటు కింగ్డమ్ సినిమాలో బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన కింగ్డమ్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

భారీ అంచనాలు పెంచేసిన కింగ్డమ్ సినిమా జూలై 31న థియేటర్లలో విడుదలైంది. అయితే, నిన్న థియేటర్లలో విడుదైలన కింగ్డమ్ సిన...