Hyderabad, జూన్ 21 -- ఓటీటీలోకి సరికొత్త సినిమాలు వెనువెంటనే వచ్చేస్తున్నాయి. ఇటీవల కాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లలో థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కుబేర ఓటీటీలోకి వచ్చేయనుందని టాక్ జోరందుకుంది.

అయితే, కుబేర మూవీ థియేటర్లలో నిన్న శుక్రవారం (జూన్ 2) విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుబేర ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. కుబేర సినిమాకు పాపులర్ కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. అంతేకాకుండా తనదైన మార్క్ స్టైల్‌తో కుబేర సినిమాను తెరకెక్కించారు.

కుబేర మూవీలో కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య పాత్రలు పోషించారు. బాలీవుడ్ టాప్ యాక్టర్లలో ఒకరైన జిమ్ సర్బ్ కీ రోల్‌లో యాక్ట్ చేశాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన కుబేర సిన...