భారతదేశం, జనవరి 15 -- ఓటీటీలోకి నిన్న థియేటర్లలో విడుదలైన నారీ నారీ నడుమ మురారి డిజిటల్ స్ట్రీమింగ్‌పై ఇప్పుడు క్యూరియాసిటీ నెలకొంది. సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్‌పై బజ్ క్రియేట్ అవుతోంది. ఈ క్రమంలోనే నారీ నారీ నడుమ మురారి ఓటీటీ రిలీజ్‌పై అందరి కన్ను పడింది.

ఎందుకుంటే 2026 సంక్రాంతికి విడుదలైన ఐదు సినిమాల్లో మిగతా వాటి కంటే ఎక్కువగా పాజిటివ్ టాక్‌ను నారీ నారీ నడుమ మురారి సంపాదించుకుంటోంది. సంక్రాంతి పండుగ చివరి సినిమాగా లేట్‌గా రిలీజ్ అయినప్పటికీ లేటెస్ట్‌గా అదరగొట్టిందంటూ టాక్ నడుస్తోంది.

ఇలా అదిరిపోయే టాక్‌తో దూసుకుపోతున్న నారీ నారీ నడుమ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి కూడా పదికి 8 రేటింగ్ వచ్చింది. జనవరి 14న సాయంత్రం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్, బ్యూటిఫుల్ హీరోయిన్స్ సంయుక్త మీనన్...