భారతదేశం, నవంబర్ 28 -- ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మంచి హిట్ అందుకుని చాలా కాలం అయింది. మొన్నటివరకు ఉస్తాద్ అని ట్యాగ్‌తో కనపడిని రామ్ పోతినేని పేరు ఇప్పుడు ఇదివరకటి ఎనర్జిటిక్ స్టార్‌గా కనిపిస్తోంది. పేరు మార్పో ఏంటీ తెలియదు కానీ రామ్ పోతినేనికి చాలా కాలం తర్వాత మంచి హిట్ పడిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

రామ్ పోతినేనిని హిట్ ఇచ్చిన సినిమానే ఆంధ్రా కింగ్ తాలూకా. హార్ట్ కోర్ అభిమానిగా రామ్ పోతినేని నటించిన ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు. అలాగే, రామ్ పోతినేనికి జోడీగా బ్యూటిపుల్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేసింది. ఇక కన్నడ స్టార్ ఉపేంద్ర ఆంధ్రా కింగ్‌గా యాక్ట్ చేశాడు.

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఆంధ్రా కింగ్ సినిమాను నిర్మించారు. ఈ మూవీలో రాహల్ రవీంద్...