భారతదేశం, నవంబర్ 8 -- వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇటీవలే బాలీవుడ్ నుంచి థామా సినిమాతో అలరించింది. ఆ సినిమా హవా పూర్తి కాకముందే మరో తెలుగు మూవీతో సందడి చేసింది బ్యూటిఫుల్ రష్మిక మందన్నా. ఆ సినిమానే ది గర్ల్‍‌ఫ్రెండ్.

ఈ సినిమాకు హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీలో హీరోగా దీక్షిత్ శెట్టి, హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటించింది. మరో కీలక పాత్రలో బ్యూటిఫుల్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కనిపించింది.

అలాగే, నటుడు రావు రమేష్, రోహిణి, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ సైతం పలు కీలక పాత్రల్లో అలరించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌పై ధీరజ్ మొగిలినేని, విద...