భారతదేశం, డిసెంబర్ 14 -- ఇలా థియేట్రికల్ రిలీజ్ కాగానే ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఆసక్తి నెలకొంటుంది. అందుకే లేటెస్ట్ థియేట్రికల్ రిలీజ్ అయ్యే సినిమాలపై బజ్ క్రియేట్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల బాలకృష్ణ అఖండ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌పై క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పుడు మరో సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓటీటీ ఆడియెన్స్.

ఆ సినిమానే మోగ్లీ 2025. స్టార్ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన సినిమానే ఇది. ఈ సినిమాకు కలర్ ఫొటో డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. మోగ్లీ సినిమాలో రోషన్ కనకాలకు జోడీగా సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా చేసింది.

అలాగే, మోగ్లీ సినిమాలో విలన్‌గా డైరెక్టర్, నటుడు బండి సరోజ్ కుమార్ నటించాడు. వీరితోపాటు వైవా హర్ష, కృష్ణ భగవాన్ కీలక పాత్రలు పోషించారు. హీరో సుహాస్, రియా సుమన్ గెస్ట్ రో...