Hyderabad, జూలై 19 -- ఓటీటీలోకి ఎలాంటి సమయాల్లో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలియడం లేదు. ఇటీవల కాలంలో సూపర్, బ్లాక్ బస్టర్ హిట్, ఫ్లాప్, డిజాస్టర్ అంటూ తేడాలు లేకుండా ఇన్ని రోజుల సమయం అనే బేధం లేకుండా సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి.

అందుకే కొత్తగా థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి నెలకొంటుంది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమా జూనియర్. ప్రముఖ వ్యాపారవేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అయిన తొలి సినిమానే జూనియర్.

జూనియర్ సినిమాలో కిరీటి రెడ్డికి జోడీగా హీరోయిన్ శ్రీలీల చేసింది. అంతేకాకుండా కిరీటి, శ్రీలీల డ్యాన్స్‌తో ఇరగదీసిన వైరల్ వయ్యారి సాంగ్ సూపర్ హిట్ అయింది. దీంతో జూనియర్ మూవీపై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల నేపథ్యంలో...