భారతదేశం, డిసెంబర్ 26 -- థియేటర్లలో తెలుగు సినిమాల సందడి కొనసాగుతోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఒకే రోజు మూడు క్రేజీ తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కాయి. ఒకటి పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ కాగా, మరొకటి హారర్ థ్రిల్లర్ శంబాల, ఇంకోటి సోషల్ డ్రామా దండోరా. ఈ మూడు సినిమాలకు మంచి టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాల ఓటీటీ రిలీజ్ లపై ఓ లుక్కేయండి.

సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ లీడ్ రోల్ ప్లే చేసిన మూవీ ఛాంపియన్. ఇది పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలోని స్పోర్ట్స్ స్టోరీగా ఛాంపియన్ మూవీ రిలీజైంది. డిసెంబర్ 25న ఇది థియేటర్లకు వచ్చింది.

ఛాంపియన్ మూవీ శాటిలైట్ రైట్స్ ను జీ నెట్ వర్క్ సొంతం చేసుకుంది. ఈ సినిమా టీవీలో అయితే జీ తెలుగులో రానుంది. ఓటీటీ హక్కులను...