భారతదేశం, డిసెంబర్ 13 -- ఓటీటీ రిలీజ్ అయ్యే సినిమాలపై ఎల్లప్పుడు అమితమైన ఆసక్తి నెలకొంటుంది. అందులోనూ కొత్తగా థియేటర్లలో విడుదలైన సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తెలుసుకోవాలని విడుదలైన రోజు నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఆడియెన్స్. ఈ క్రమంలో థియేట్రికల్ రిలీజ్ రోజు నుంచే సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌‌ఫామ్స్ ఏంటనేది తెలిసిపోతుంది.

ఈ నేపథ్యంలో ఇలాంటి ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ నందమూరి నటసింహం బాలకృష్ణ లేటేస్ట్ మూవీపై ఉంది. ఆ సినిమానే అఖండ 2 తాండవం. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమానే అఖండ 2 తాండవం. మాస్ డైరెక్టర్ బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన నాలుగో సినిమా ఇది.

సింహా, లెజెండ్, అఖండ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత బోయపాటి-బాలయ్య కాంబోలో వచ్చిన అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా భారీ అంచనాల నడుమ వారం ర...