భారతదేశం, జనవరి 14 -- ఓటీటీలోకి ఎన్నో జోనర్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చినా డివోషనల్ కథాశంతో రిలీజ్ అయ్యే మూవీస్ చాలా అరుదు. ఈ క్రమంలో తెలుగులో డివోషనల్ డ్రామాగా తెరకెక్కిన మూవీ అనంత. ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్య సాయి బాబాపై తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు, సుహాసిని కీలక పాత్రలు పోషించారు.

చాలా కాలం నిరీక్షణ తర్వాత వెటరన్ డైరెక్టర్ సురేష్ కృష్ణ (భాషా ఫేమ్) రూపొందించిన ఆధ్యాత్మిక చిత్రమే ఈ 'అనంత'. ఈ మూవీలో జగపతి బాబు, సుహాసినితోపాటు రామరావు జాదవ్, వైజీ మధువంతి, వైజీ మహేంద్రన్, అర్జున్ రమన్, శ్రీ రంజని, నిళల్‌గల్ రవి, టెంపర్ వంశీ, అభిరామి వెంకటాచలం, తలైవాసల్ విజయ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

గతేడాది చిత్రీకరణ పూర్తి చేసుకున్న అనంత సినిమా థియేటర్లలో విడుదల కావాల్సింది. అనంత థియేట్రికల్ రిలీజ్ కోసం మూవీ యూనిట్ చాలా ప్రయత్నాలు చేసినట్లు, కా...