Hyderabad, అక్టోబర్ 11 -- ఓటీటీలోకి నిన్న ఒక్కరోజే ఏకంగా 7 సినిమాలు తెలుగు భాషలో డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో సైకలాజికల్, హారర్, లీగల్, ఇన్వెస్టిగేటివ్, మైథలాజికల్ వంటి అనేక రకాల జోనర్స్ ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

తేజ సజ్జా, మంచు మనోజ్ హీరో విలన్‌గా నటించిన మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా మిరాయ్. కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అక్టోబర్ 10 నుంచి జియో హాట్‌స్టార్‌లో మిరాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

హిందీలో తెరకెక్కన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ సెర్చ్: ది నైనా మర్డర్ కేస్. కొంకణ సేన్ శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అక్టోబర్ 10 నుంచి హిందీతోపాటు తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవు...