భారతదేశం, జూన్ 30 -- ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍లకు మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే ఈ జానర్లో సిరీస్‍లు వస్తూనే ఉంటాయి. సస్పెన్స్, ట్విస్టులు, ఉత్కంఠతో ఉండటంతో ఇలాంటి సిరీస్‍లకు ఎక్కువ ఆదరణ దక్కుతుంటుంది. ఈ క్రమంలో క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో 'మండాలా మర్డర్స్' అనే నయా వెబ్ సిరీస్ వస్తోంది. బాలీవుడ్ స్టార్ నటి వాణి కపూర్, వైభవ్ రాజ్ గుప్తా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారైంది. ఓ పోస్టర్ వచ్చేసింది.

మండాలా మర్డర్స్ వెబ్ సిరీస్ జూలై 25వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్నిఆ ప్లాట్‍ఫామ్ నేడు (జూన్ 30) అధికారికంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఓ పోస్టర్ కూడా రివీల్ చేసింది నెట్‍ఫ్లిక్స్. ఈ పోస్టర్లో వాణి కపూర్ గన్ పట్టుకొని ఉన్నారు. వైభవ్, శ్రీయా పింయోన్కర్, సువేన్ చావ్లా...