భారతదేశం, అక్టోబర్ 4 -- తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస హిట్లతో అదరగొడుతున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కడై'. ఈ తమిళ సినిమా తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజైంది. ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ హార్ట్ టచింగ్ గా ఉందనే టాక్ వినిపిస్తోంది.

ధనుష్, నిత్యా మీనన్ జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా ఇడ్లీ కొట్టు అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలైంది. ధనుష్ ఈ సినిమాలో హీరో మాత్రమే కాదు. వండర్బార్ ఫిల్మ్స్ బ్యానర్ కింద చిత్రానికి రచన, దర్శకత్వం, సహా నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

థియేటర్లలో మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో సాగిపోతున్న ఇడ్లీ కడై ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పై నిర్మాతలు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ నివేద...