భారతదేశం, జూలై 10 -- ఓటీటీలోకి మరో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ రాబోతోంది. గ్రామంలో జరిగే హత్యల వెనుక ఉన్నది ఎవరో కనిపెట్టే కథతో, గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో సాగే 'డిటెక్టివ్ ఉజ్వలన్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమైంది.

మే 23, 2025న థియేట్రికల్ రిలీజ్ తో డిటెక్టివ్ ఉజ్వలన్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రదర్శన చేసింది. దీంతో ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. రీసెంట్ అప్ డేట్స్ ప్రకారం ఈ మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చే టైమ్ ఆసన్నమైంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఈ పాపులర్ ఓటీటీలో మూవీ జూలై 11న రిలీజ్ కానుంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం, ఏబీ జార్జ్ చేసిన తాజా సోషల్ మీడియా అప్‌డేట్ ప్రకారం నెట్‌ఫ్లిక్స్ ...