భారతదేశం, జనవరి 9 -- కొంతకాలంగా ఫుల్ యాక్షన్, మాస్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నాడు ప్రభాస్. ఇప్పుడు ది రాజా సాబ్ తో తెరపై కొత్తగా కనిపించాడు. వింటేజీ లుక్ తో పాటు కామెడీ టైమింగ్, డ్యాన్స్ లతో ఇరగదీశాడు. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ ఓటీటీ వివరాలు, డిజిటల్ రైట్స్ రేట్ గురించి తెలుసుకుందాం.

ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన మూవీ ది రాజా సాబ్. ఈ సినిమా శుక్రవారం (జనవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది రాజా సాబ్ చిత్రంపై మిక్స్ డ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌ లో రిలీజ్ కానుంది. ది రాజా సాబ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుంది.

ది రాజా సాబ్ డిజిటల్ రైట్స్ ను జియోహాట్‌స్టార్‌ దక్కించుకుంది. అలాగే ...