భారతదేశం, నవంబర్ 30 -- 2025లో రష్మిక మందన్న హీరోయిన్ గా చేసిన అయిదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 5 మూవీస్ ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటాయి. ఆమె రీసెంట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో 2025లో థియేటర్లో రిలీజైన రష్మిక మందన్న సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయో ఓ లుక్కేయండి.

ఛావా సినిమాతో 2025ను గ్రాండ్ గా స్టార్ట్ చేసింది రష్మిక మందన్న. విక్కీ కౌశల్ శంభాజీగా నటించిన ఈ పీరియాడికల్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రంలో యశుబాయిగా రష్మిక తన యాక్టింగ్ తో అలరించింది. ఇది ఫిబ్రవరి 14, 2025న థియేటర్లో రిలీజైంది. ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో రష్మిక మందన్న కలిసి న...