భారతదేశం, జనవరి 8 -- హారర్ థ్రిల్లర్.. అందులోనూ జాంబీల బ్యాక్‌డ్రాప్ లో ఎన్నో సినిమాలు మీరు చూసే ఉంటారు. కానీ ఇప్పుడో డిఫరెంట్ థ్రిల్లర్ ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా పేరు డ్యుయల్ (Dual). నాట్ ఆల్ ద మూవీస్ ఆర్ సేమ్ (Not All The Movies Are Same) అంటూ ఈ సినిమా గతేడాది వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.

తెలుగులో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ ఈ డ్యుయల్. గతేడాది థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు శుక్రవారం అంటే జనవరి 9 నుంచి ఏకంగా ఐదు భాషల్లో లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రానుంది. జాంబీల బ్యాక్‌డ్రాప్ లో సాగే ఈ సినిమాకు ఐఎండీబీలో 8.7 రేటింగ్ ఉండటం విశేషం.

టాలీవుడ్‌లో మరో ప్రయోగాత్మక సినిమా ఇది. సురేష్ సాగిరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ హా...