Hyderabad, జూన్ 30 -- ఓటీటీలోకి రవితేజ మేనల్లుడు నటించిన మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సినిమా పేరు జగమెరిగిన సత్యం. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజ్ కాగా.. మొత్తానికి రెండున్నర నెలల తర్వాత ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడాలి? అసలు కథేంటి అన్న వివరాలు ఇక్కడ చూడండి.

తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ జగమెరిగిన సత్యం. ఈ సినిమా వచ్చే శుక్రవారం (జులై 4) నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని సోమవారం (జూన్ 30) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"అహంకారంతో నడిచే ఓ ఊళ్లో ఒక వ్యక్తి ప్రేమ అతని అతిపెద్ద తిరుగుబాటు అయింది. జగమెరిగిన సత్యం.. జులై 4 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

జగమెరిగిన సత్యం సి...