భారతదేశం, నవంబర్ 22 -- ఓటీటీలోకి తెలుగు బోల్డ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. ఇదివరకే 3 రోజెస్ సీజన్ 2లోని ప్రధాన పాత్రలను ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ గ్లింప్స్ వదిలారు. తాజాగా త్రీ రోజెస్ సీజన్ 2 టీజర్‌ను (నవంబర్ 21) విడుదల చేశారు. ఈ టీజర్‌లో త్రీ రోజెస్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్.

అయితే, 2021లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు బోల్డ్ రొమాంటిక్ కామెడీ సిరీస్ 3 రోజెస్. గ్లామర్ బ్యూటీలు పాయల్ రాజ్‌‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ మెయిన్ లీడ్ రోల్స్ చేసిన ఈ సిరీస్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా రొమాంటిక్, కిస్ సీన్లు, బోల్డ్ డైలాగ్స్‌తో 3 రోజెస్ సీజన్ 1 అలరించింది.

ఇప్పుడు నాలుగేళ్లకు ఈ సూపర్ హిట్ బోల్డ్ కామెడీ సిరీస్‌ 3 రోజెస్‌కు సీక్వెల్‌గా సీజన్ 2 రానుంది. ఈపాటికే త్రీ రోజేస్ సీజన...