Hyderabad, ఏప్రిల్ 29 -- ఓటీటీలో బోల్డ్ కంటెంట్ కు కొదవే లేదు. ఇక ఎక్స్‌క్లూజివ్‌గా తెలుగు కంటెంట్ అందించే ఆహా వీడియో ఓటీటీ కూడా ఇలాంటి కంటెంట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూనే ఉంది. గతంలో 3 రోజెస్ పేరుతో ఇలాంటి ఓ బోల్డ్ వెబ్ సిరీస్ అందించింది. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ కూడా రాబోతోంది. ఇందులో నటించిన కొత్త పాత్రను తాజాగా పరిచయం చేశారు.

3 రోజెస్ రెండో సీజన్ లో కొత్త రోజ్ వచ్చిందంటూ మంగళవారం (ఏప్రిల్ 29) ఆహా వీడియో ఓటీటీ ఓ చిన్న గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది. ఈ కొత్త రోజ్ ను పరిచయం చేయనున్నట్లు ఒక రోజు ముందే వెల్లడించారు. ఇప్పుడు 39 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియోను రిలీజ్ చేశారు. కొత్త సీజన్ లో ఖుషితా కల్లాపు కొత్తగా ఎంట్రీ ఇస్తోంది. ఈ పాత్ర మరింత బోల్డ్ గా ఉండబోతున్నట్లు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.

"కొత్త రోజ్‌ను కలవండి. ఖుషితా కల్లాపు. ...