Hyderabad, జూన్ 23 -- ఈ ఏడాది ఏప్రిల్ 4న థియేటర్లలో రిలీజైన తెలుగు థ్రిల్లర్ మూవీ శారీ (Saaree). ఒకప్పుడు ఇండియాలోనే ప్రముఖ దర్శకుల్లో ఒకడిగా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సంస్థ ఆర్జీవీ డెన్ ప్రోడక్ట్ గా వచ్చింది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మొత్తానికి సుమారు మూడు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

రామ్‌గోపాల్ వర్మ సమర్పించిన మూవీ శారీ. అతడే స్క్రిప్ట్ కూడా అందించాడు. ఈ శారీ మూవీ వచ్చే శుక్రవారం (జూన్ 27) నుంచి లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఓటీటీప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్నా కూడా ఈ సినిమాను చూడొచ్చు.

తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం. ఏప్రిల్ 4న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. గత కొన్నేళ్లుగా ఆ...