Hyderabad, ఆగస్టు 17 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ జోనర్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. థియేట్రికల్ రిలీజ్ అవ్వగానే నెల లేదా 20 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ టైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. అయితే, ఇంకొన్ని థియేటర్లలో నుంచి వెళ్లిపోయి నెలలు గడుస్తున్న డిజిటల్ ప్రీమియర్‌కు నోచుకోవు.

ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమా కూడా అలాంటి కోవకు చెందినదే. ఆ సినిమానే నారి: ది ఉమెన్. సీనియర్ హీరోయిన్ ఆమని ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. నిజానికి ఇది ఒక తెలుగు సోషల్ డ్రామా చిత్రం. కానీ, ఇందులో క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఎక్కువగానే ఉంటాయి. అవి కూడా నిజ జీవితంలో జరిగే ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని తెరకెక్కించినవి.

సమాజంలో మహిళలకు, బాలికలను చూసే విధానం, వారిపై జరిగే అఘాయిత్యాలు, వారు ఎదుర్కొ...