భారతదేశం, నవంబర్ 20 -- ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ వస్తోంది. అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 8.8 రేటింగ్ ఉండటం విశేషం. బ్రహ్మాజీ, శత్రు, మహేంద్రన్ లాంటి నటులు ఇందులో నటించారు.

తెలుగులో వచ్చిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కర్మణ్యే వాధికారస్తే. ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ కాగా.. శుక్రవారం (నవంబర్ 21) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. "కర్మణ్యే వాధికారస్తే రేపు వస్తోంది. చాలా లోతుగా మనసును తాకే స్టోరీ కోసం సిద్ధంగా ఉండండి" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. మూవీకి సంబంధించిన చిన్న టీజర్ ను పోస్ట్ చేసింది.

కర్మణ్యే వాధికారస్తే సినిమాను అమర్‌దీప్ చల్లపల్లి డైరెక్ట్ చేశాడు. ఇందులో ఐరా దయానంద్, బ్రహ్మాజీ, శత్రు, మహ...