Hyderabad, మే 7 -- తమిళ వెబ్ సిరీస్ ఒకటి తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి ఈ సిరీస్ తమిళంలో స్ట్రీమింగ్ మొదలైంది. ఇప్పుడీ సిరీస్ ను తెలుగులోకి డబ్ చేసి తీసుకొస్తున్నారు. ఈ కామెడీ వెబ్ సిరీస్ పేరు ఆఫీస్. అసలు ఈ సిరీస్ ఏంటి? స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయాలు తెలుసుకోండి.

ఆఫీస్ వెబ్ సిరీస్ జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇదొక కామెడీ సిట్‌కామ్ వెబ్ సిరీస్. ఇప్పుడీ సిరీస్ ను తెలుగులోకి తీసుకొస్తున్నట్లు జియోహాట్‌స్టార్ బుధవారం (మే 7) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"హాట్‌స్టార్ స్పెషల్స్ ఆఫీస్ తెలుగులో ఎక్స్‌క్లూజివ్ గా మే 9 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. దీనికి ఓ 40 సెకన్ల వీడియోను కూడా పోస్ట్ చేసింది.

ఆఫీస్ వెబ్ సిరీస్ లో గురు లక్ష్మణ్...