Hyderabad, జూన్ 20 -- కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన లీగల్ థ్రిల్లర్ మూవీ యుద్ధకాండ ఛాప్టర్ 2. ఈ ఏడాది ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఐఎండీబీలో ఏకంగా 9.2 రేటింగ్ సొంతం చేసుకున్న సినిమా ఇది.

యుద్ధకాండ్ ఛాప్టర్ 2 సినిమా శుక్రవారం (జూన్ 20) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి మొదటి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

అలాంటి సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ అయింది. ఒకేసారి కన్నడతోపాటు తెలుగు ఆడియోతోనూ రావడంతో ఇక్కడి ప్రేక్షకులను కూడా మూవీ అలరించబోతోంది. అజయ్ రావ్, అర్చన జోయిస్ లాంటి వాళ్లు నటించిన సినిమా ఇది.

కన్నడ ఇండస్ట్రీ నుంచి కోర్టురూమ్ డ్రామాలు చాలా అరుదుగా వస్తుంటాయి....