భారతదేశం, నవంబర్ 8 -- ఓటీటీ ఆడియెన్స్‌కు ఎక్కువగా ఇష్టమైన జోనర్లలో ముందు వరుసలో ఉంంటుంది హారర్ థ్రిల్లర్. ఈ జోనర్స్‌కు విభిన్న ఎలిమెంట్స్ యాడ్ చేసి మరి డిఫరెంట్‌గా సినిమాలను రూపొందిస్తున్నారు దర్శక నిర్మాతలు. అలా ఇటీవల వచ్చి మంచి హిట్ అందుకున్న ఓటీటీ హారర్ థ్రిల్లర్ మూవీనే జరణ్.

చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ కథాంశంతో మతిపోగొట్టే ట్విస్టులతో జరణ్ సినిమాను తెరకెక్కించారు. మరాఠీలో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన జరణ్ జూన్ 6న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న జరణ్ ఆగస్ట్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే, కేవలం మరాఠీ భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో మాత్రమే జరణ్ ఓటీటీ రిలీజ్ అయింది. అయినా కూడా ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్‌లో దూసుకుపోయింది జరణ్ సినిమా. అలా ట్రెండింగ్‌లో ఉంటూ ఓటీటీలో సూపర్ హిట్ అయిన జర...