Hyderabad, జూలై 31 -- ఓటీటీ ఆడియెన్స్‌ను ఎక్కువగా కట్టిపడేసే సినిమా జోనర్లలో హారర్ ఒకటి. ఈ హారర్ థ్రిల్లర్ జోనర్స్‌కు కామెడీ, అడల్ట్, యాక్షన్, ఫాంటసీ, సైకలాజికల్ వంటి వివిధ ఎలిమెంట్స్‌ను యాడ్ చేసి తెరకెక్కిస్తుంటారు దర్శకనిర్మాతలు. మనుషుల్లో కామన్ అంశమైన భయం మీద వచ్చే ఈ సినిమాలు దాదాపుగా మంచి ఆదరణ దక్కించుకుంటాయి.

ఇప్పటికీ సౌత్, హిందీ భాషల్లో ఎన్నో హారర్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. వాటిలో డిఫరెంట్ స్టోరీతో తమిళంలో తెరకెక్కిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ సినిమానే జిన్ ది పెట్. తమిళంలో మే 30న థఇయేటర్లలో విడుదలైన జిన్ ది పెట్ సినిమాకు టాక్ అంతంత మాత్రంగానే వచ్చింది. కానీ, రేటింగ్ మాత్రం ఎంతో సాధించుకుంది.

ఐఎమ్‌డీబీ సంస్థలో పదికి ఏకంగా 8 రేటింగ్‌ను సొంతం చేసుకుంది జిన్ ది పెట్. అలాంటి జిన్ ఆ వెంటనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో విడు...