భారతదేశం, జనవరి 12 -- ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 13 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఫాంటసీ, సైకలాజికల్, రొమాంటిక్, కామెడీ, అడ్వెంచర్ వంటి విభిన్న జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

జిగ్రీస్ ఓటీటీ: నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక్క రూపాయి లేకుండా గోవాకు వెళ్లే కథతో తెరకెక్కిన సినిమానే జిగ్రీస్. సన్ నెక్ట్స్‌, అమెజాన్ ప్రైమ్ రెండింట్లో జనవరి 6 నుంచి జిగ్రీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

సైలెంట్ స్క్రీమ్స్ ఓటీటీ: తెలంగాణలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన సైలెంట్ స్క్రీమ్స్ కూడా సన్ నెక్ట్స్ ఓటీటీలో జనవరి 8 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

మళ్లీ వచ్చిన వసంతమ్: ఓటీటీలో తెలుగులో డైరెక్టర్ ఓటీటీ రిలీజ్ అయిన రొమాంటిక్ డ్రామా మూవీనే మళ్లీ వచ్చిన వసంతమ్. ఈటీవీ విన్‌లో జనవరి 11 నుంచి మళ్లీ వచ్చిన వసంతమ్ ఓట...