Hyderabad, మే 14 -- ఓ తమిళ యాక్షన్ కామెడీ మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా పేరు గ్యాంగర్స్ (Gangers). ప్రముఖ తమిళ కమెడియన్ వడివేలు, సుందర్ సి లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా.. ఏప్రిల్ 24న థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ మూవీతో తెలుగు సహా మొత్తం ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కు రాబోతోంది.

గ్యాంగర్స్ తమిళ యాక్షన్ కామెడీ మూవీ. సుందర్ సి డైరెక్ట్ చేసి లీడ్ రోల్లో నటించాడు. ఈ సినిమా గురువారం (మే 15) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రైమ్ వీడియో మూడు వారాల్లోనే స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

డైరెక్...