Hyderabad, సెప్టెంబర్ 12 -- మలయాళం మిస్టరీ కామెడీ థ్రిల్లర్ మూవీ డిటెక్టివ్ ఉజ్వలన్ తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన ఈ థ్రిల్లర్ మూవీకి థియేటర్లలో ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ప్రశాంతమైన ఊళ్లో వరుస హత్యల కలకలాన్ని ఓ పోలీస్ ఆఫీసర్ తో కలిసి లోకల్ డిటెక్టివ్ ఎలా పరిష్కరిస్తాడన్నదే ఈ సినిమా స్టోరీ.

మలయాళం థ్రిల్లర్ సినిమా అభిమానులకు గుడ్ న్యూస్. డిటెక్టివ్ ఉజ్వలన్ అనే మిస్టరీ కామెడీ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో శుక్రవారం (సెప్టెంబర్ 12) నుంచి తెలుగుతోపాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.

మే 23న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. జులైలోనే నెట్‌ఫ్లిక్స్ లో మలయాళం ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ కు వచ్చింది. తాజాగా లయన్స్‌గేట్ ప్లే ఓట...