భారతదేశం, డిసెంబర్ 26 -- కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇటీవల వచ్చిన ప్రయోగాత్మక సస్పెన్స్ థ్రిల్లర్లలో 'వృత్త' (Vritta) ఒకటి. బిగ్ బాస్ కన్నడ విజేత షైన్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. తన విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయింది. మరి ఈ సినిమా ఏంటి? ఎక్కడ చూడాలన్న వివరాలు తెలుసుకోండి.

ఈ ఏడాది ఆగస్టు 1న థియేటర్లలో రిలీజైన మూవీ వృత్త. ఈ సినిమా సుమారు ఐదు నెలల తర్వాత శుక్రవారం (డిసెంబర్ 26) నుంచి జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ సంపాదించిన ఈ సినిమాకు ఓటీటీలో మరింత ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంది.

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఓ ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్ వృత్త. లిఖిత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమ...