భారతదేశం, నవంబర్ 18 -- తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'డీజిల్' ఓటీటీ రిలీజ్ కోసం సిద్ధంగా ఉంది. హరీష్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 21) నుండి ఆహా తమిళం, ఓటీటీప్లే ప్రీమియంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ వెల్లడించింది.

ఈ ఏడాది హరీష్ కళ్యాణ్ నటించిన ఏకైక మూవీ 'డీజిల్'. ఈ సినిమా ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్', మారి సెల్వరాజ్-ధ్రువ్ విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'బైసన్'తో పాటు థియేటర్లలో విడుదలైంది. 'డ్యూడ్' గత వారం నెట్‌ఫ్లిక్స్‌లో పలు భాషల్లో అందుబాటులోకి రాగా.. 'బైసన్' కూడా నవంబర్ 21 నుండి అదే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. ఇక ఇప్పుడు డీజిల్ డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయింది. ఈ సినిమా ఆహా తమిళంలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ డీజిల్ సినిమాలోని ప్రధాన పాత్ర డీజిల్ వాసు (హరీష్ కళ్యాణ్). ఇతను చేపల వేట కమ్య...