భారతదేశం, జనవరి 11 -- తమిళంలో మైథలాజికల్ థ్రిల్లర్ తరచూ వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఎన్నో మూవీస్, వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో ఉన్నాయి. వాటిలోకి తాజాగా మహాసేన (Mahasenha) అనే మరో సినిమా వచ్చి చేరుతోంది. ఈ మూవీ ఏంటి? ఐఎండీబీలో దీనికి 9.2 రేటింగ్ రావడానికి కారణమేంటో చూడండి.

ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ థ్రిల్లర్ కు కాస్త మైథాలజీని జోడించి వస్తున్న సినిమాల సంఖ్య పెరుగుతోంది. కాంతార కూడా అలా వచ్చే పెద్ద విజయం సాధించింది. తమిళంలోనే మహాసేన పేరుతో ఓ మూవీ వచ్చింది. ఈ సినిమా మంగళవారం (జనవరి 13) నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

"సస్పెన్స్ తో కూడిన అడ్వెంచరస్ థ్రిల్లర్ మహాసేన.. జనవరి 13న కేవలం ఆహా తమిళంలో స్ట్రీమింగ్ అవుతుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. రెండు భాగాలుగా ఈ మూవీ రానుండగా.. మొదటి భాగం ఇప్పుడు స్ట్రీమింగ్ క...