Hyderabad, జూలై 14 -- థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్.. ఈ వారం మీరు ఇష్టపడే ఓ గ్రిప్పింగ్ తమిళ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా పేరు మనిదర్గల్ (Manidhargal). దీనర్థం మనుషులు అని. మే 30న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేయడంతో ఐఎండీబీలో ఏకంగా 9.1 రేటింగ్ సొంతం చేసుకుంది. పీకలదాకా తాగి కష్టాల్లో పడే స్నేహితుల స్టోరీ ఇది.

తమిళ థ్రిల్లర్ మూవీ మనిదర్గల్ (Manidhargal) ఆహా తమిళం ఓటీటీలోకి రాబోతోంది. ఈ గురువారం (జులై 17) నుంచే సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ సోమవారం (జులై 14) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"మనిదర్గల్ ఎలా ఉన్నారు? మనిదర్గల్ జులై 17న ఆహా తమిళంలో ప్రీమియర్ కానుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా పోస్ట్ చేసింది. ఆ పోస్టర్ పై మూవీ ఐఎండీబీ రేటింగ్ 9.1గా ఉన్న...